
లైసెన్స్డ్ సర్వేయర్ల సమస్యలు అసెంబ్లీలో లేవనెత్తుతాం: కేటీఆర్
Advertisement
హైదరాబాద్: లైసెన్స్డ్ సర్వేయర్లు ఎదుర్కొంటున్న సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నంది నగర్‌లోని తన నివాసంలో వికారాబాద్ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మర్యాదపూర్వకంగా కలిసి లైసెన్స్డ్ సర్వేయర్ల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో వికారాబాద్ జిల్లాకు చెందిన లైసెన్స్డ్ సర్వేయర్లు కేటీఆర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్, వికారాబాద్ బీఆర్‌ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గోపాల్ ముదిరాజ్‌తో పాటు వికారాబాద్ జిల్లా లైసెన్స్డ్ సర్వేయర్లు పాల్గొన్నారు.
Share this article


