
కేంద్ర నిధులతో గ్రామాభివృద్ధి పనులు: వడ్ల నందు
Advertisement
మోమిన్ పేట : , గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులు అన్నీ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినవేనని బిజెపి నియోజకవర్గ కోఆర్డినేటర్ దిశా కమిటీ సభ్యుడు వడ్ల నందు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మోమిన్పేట్ మండలంలోని మల్‌రెడ్డి గూడెం గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎంపీ నిధులు మరియు రామ్ జీఎన్‌ఆర్‌ఈజీఎస్ (RAM G/NREGS) ద్వారా రూ.10 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఈ పనులకు గ్రామ సర్పంచ్ పట్లోళ్ల నిర్మల ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ లీగల్ సెల్ పార్లమెంట్ కన్వీనర్ రమేష్ , బీజేపీ మోమిన్పేట్ మండల అధ్యక్షుడు ఆశిరెడ్డి , గ్రామ నాయకులు విక్రమ్ రెడ్డి, పంచాయతీ వార్డు సభ్యులు, ఉప సర్పంచ్ వెంకటేశం తదితర నాయకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Share this article


