
General
మార్చి2న వికారాబాద్ కు రాహుల్ గాంధీ
Tuesday, 24 February 20263 views
Advertisement
వికారాబాద్: వికారాబాద్ జిల్లాలోని అనంతగిరిలో నిర్వహిస్తున్న శిక్షణా తరగతులకు లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల కోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తుండగా అనంతగిరి హరిత రిసార్ట్స్‌లో జరుగుతున్న ఈ శిబిరంలో పార్టీ బలోపేతం, కేడర్ వ్యవస్థ పటిష్టత, రాబోయే ఎన్నికల వ్యూహాలు, ప్రజా సమస్యలపై ఉద్యమ కార్యాచరణ వంటి అంశాలపై రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేయనున్నారు. జిల్లా స్థాయిలో పార్టీ నిర్మాణాన్ని మరింత బలపరచడమే లక్ష్యంగా ఈ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Share this article


