
కాంగ్రెస్ ఓట్ల కోసం బీసీలను ఉపయోగించుకుంది: శ్రీనివాస్ గౌడ్
Advertisement
వికారాబాద్, మార్చి 22: కాంగ్రెస్ పార్టీ బీసీ వర్గాలను కేవలం ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుందని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఓట్లతో అధికారంలోకి వచ్చి, వారి అభివృద్ధిని విస్మరించిందన్నారు. బడ్జెట్‌లో బీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని, ప్రకటించిన నిధుల్లో చాలా తక్కువ మాత్రమే ఖర్చు చేశారని ఆరోపించారు. ముదిరాజ్‌లకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడుతూ, కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదని విమర్శించారు. ఆరు గ్యారెంటీల విషయంలో కూడా ప్రజలను నిరాశపరిచిందన్నారు. దేశంలో బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని, మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు 33 శాతం కోటా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Share this article


