
10వ తరగతి పరీక్షలు పాదర్శకంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్
Advertisement
వికారాబాద్: 10వ తరగతి పరీక్షలు పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుండి 10వ తరగతి పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపరిండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, ఇన్వెజిలేటర్లకు జూమ్ మీటింగ్ ద్వారా పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...పరీక్షలు సజావుగా జరిగేలా, ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరీక్షల్లో విధులు నిర్వహించే సిబ్బంది వద్ద పరీక్షలు నిర్వహించే ప్రాంగణంలో మొబైల్, ఎలక్ట్రానిక్ వస్తువులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. పరీక్ష కేంద్రంలోకి బయట వ్యక్తులను రాకుండా కట్టడి చేయాలని తెలిపారు. పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించేముందు ఏఎన్ఎం, పోలీస్ బందోబస్తు, వాటర్ బాయ్ లను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని కలెక్టర్ తెలిపారు. పరీక్ష కేంద్రాలను జీరో మొబైల్ జోన్ గా ఉంచే బాధ్యత చీఫ్ సూపరిండెంట్లదేనని కలెక్టర్ తెలిపారు. రోజువారి డ్యూటీ రిజిస్టర్, ప్రశ్నపత్రం పేపర్ సీరియల్ నెంబర్ రిజిస్టర్ లను తప్పనిసరిగా నమోదు చేయాలని ఆయన తెలిపారు. పరీక్ష కేంద్ర పరిసరాలు పరిశుభ్ర వాతావరణంలో ఉండే విధంగా చూడాలని కలెక్టర్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించినట్లయితే సీసీఏ రూల్స్ మేరకు చర్యలు తీసుకోబడతాయని కలెక్టర్ హెచ్చరించారు. కలెక్టరేట్ నుండి జూమ్ మీటింగ్ లో అదనపు కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరి, డిఇఓ రేణుకా దేవి లు పాల్గొన్నారు.
Share this article


