download
 విద్యార్థిని ఆత్మహత్య
General

విద్యార్థిని ఆత్మహత్య

Tuesday, 24 February 20267 views

Advertisement

తిరుపతి: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలో ఉన్న ప్రైవేట్ హాస్టల్‌లో ఎం బి యు ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. మృతురాలు పుంగనూరు నియోజకవర్గంలోని మంగళం గ్రామానికి చెందిన భువన (20)గా గుర్తించారు. ఆమె మోహన్ బాబు యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నట్లు సమాచారం. నిన్న రాత్రి హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. ఘటనపై సమాచారం అందుకున్నచంద్రగిరి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కాలేజ్ యాజమాన్యం తల్లిదండ్రులకు ఆలస్యంగా సమాచారం ఇచ్చిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు కాలేజ్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని చంద్రగిరి సీఐ సురేష్ కుమార్ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Share this article

Related Articles