download
మర్పల్లిలో ఇఫ్తార్ విందులో  అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
General

మర్పల్లిలో ఇఫ్తార్ విందులో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

Tuesday, 24 February 20262 views

Advertisement

మర్పల్లి, మార్చి 24 : మర్పల్లి మండల కేంద్రంలోని మజీద్‌లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. రంజాన్ ఉపవాస దీక్షల విరమణ సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్పీకర్ ముందుగా ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం ముస్లిం సోదరులకు ఖర్జూరాలు తినిపించి ఉపవాస దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా పరస్పర సౌభ్రాతృత్వం, సామరస్యానికి ఇఫ్తార్ విందులు వేదికలుగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share this article

Related Articles