
వికారాబాద్‌కు బడ్జెట్‌లో అన్యాయం: బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గోపాల్
Advertisement
వికారాబాద్, మార్చి 23: రాష్ట్ర బడ్జెట్‌లో వికారాబాద్ జిల్లాకు ప్రాధాన్యం కల్పించలేదని బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గోపాల్ ముదిరాజ్ పేర్కొన్నారు. సోమవారం వికారాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ. బడ్జెట్‌లో జిల్లాకు "గుండు సున్న" మాత్రమే దక్కిందని విమర్శించారు. గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఇప్పటివరకు అమలు చేయలేదని ఆరోపించారు. వికారాబాద్ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు తీసుకురావాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు కొత్తగా ఏ ప్రాజెక్ట్ కూడా తీసుకురాలేదని విమర్శించారు. అలాగే, టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మంజూరైన అభివృద్ధి పనులకే ప్రస్తుత ప్రభుత్వం శంకుస్థాపనలు చేస్తోందని పేర్కొన్నారు. కొత్తగా అభివృద్ధి పనులు చేపట్టకుండా పాత ప్రాజెక్టులకే పరిమితమవడం ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. స్పీకర్ స్థాయిలో ఉన్న నాయకుడు తన నియోజకవర్గం, జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని, కానీ వికారాబాద్‌కు బడ్జెట్‌లో అన్యాయం జరిగిందని మండిపడ్డారు. జిల్లా ప్రజలకు తగిన న్యాయం చేయాలని, అభివృద్ధి కార్యక్రమాలకు తగిన నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ ఫ్లోర్ లీడర్ వేణు, నాయకులు మేక చంద్రశేఖర్ రెడ్డి, సుభాన్ రెడ్డి, మల్లికార్జున్ టిఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Share this article


