
జాతీయ స్థాయిలో నేషనల్ టాపర్‌గా నిలిచిన వికారాబాద్ విద్యార్థి
Advertisement
వికారాబాద్: వికారాబాద్ పట్టణంలోని వేదిక్ హై స్కూల్‌కు చెందిన మూడవ తరగతి విద్యార్థి ఎ. విహాన్ రెడ్డి గణిత ఒలింపియాడ్‌లో జాతీయ స్థాయిలో నేషనల్ టాపర్‌గా నిలిచి పాఠశాలకు గర్వకారణంగా నిలిచాడు. ఇండియన్ బ్రిలియంట్ ఒలింపియాడ్ నిర్వహించిన గణిత ఒలింపియాడ్ పరీక్షలో దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు పాల్గొనగా, విహాన్ రెడ్డి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మొదటి స్థానం సాధించాడు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ. విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీసి వారికి సరైన మార్గదర్శనం చేయడం తమ లక్ష్యమని తెలిపారు. విహాన్ రెడ్డి సాధించిన ఈ విజయం ఇతర విద్యార్థులకు కూడా ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. విద్యార్థి విజయాన్ని పురస్కరించుకొని పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు విహాన్ రెడ్డిని అభినందించారు. అలాగే విద్యార్థి విజయానికి సహకరించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయంతో పాఠశాల పేరు రాష్ట్ర స్థాయితో పాటు జాతీయ స్థాయిలో కూడా మరింత ప్రతిష్టను పొందిందని పేర్కొన్నారు
Share this article


