download
విజయ్ కుటుంబాన్ని పరామర్శించిన పట్నం మహేందర్ రెడ్డి
General

విజయ్ కుటుంబాన్ని పరామర్శించిన పట్నం మహేందర్ రెడ్డి

Saturday, 21 March 2026132 views

Advertisement

వికారాబాద్ : ఈనెల 10వ తేదీన గుండెపోటుతో అఠాన్భమరణానికి గురైన తన వ్యక్తిగత భద్రతా సిబ్బంది (గన్మెన్) విజయ్ కుమార్ కుటుంబాన్ని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పరామర్శించారు. శాసనసభ సమావేశాల నేపథ్యంలో నిన్న జరిగిన దశదినకర్మకు హాజరు కాలేని పరిస్థితుల్లో ఆయన శనివారం వికారాబాద్ లోని విజయ్ కుమార్ ఇంటికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను మరో మారు పలుకరించారు. ప్రభుత్వపరంగా విజయ్ కుమార్ కుటుంబానికి అందవలసిన అన్ని సదుపాయాలను వెంటనే అందించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి తో మహేందర్ రెడ్డి ఫోన్లో చర్చించారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్ సమన్వయంగా విజయ్ కుటుంబానికి అందాల్సిన తక్షణ సహాయం అందిస్తారని చెప్పారు. తన వంతుగా పూర్తి సహకారం అందిస్తామని అన్నారు. విజయ్ తల్లిదండ్రులు ఆనంద్ కుమార్, లక్ష్మి, సోదరులు అశోక్, రాజు, శ్రీనివాస్ భార్య లక్ష్మీ, కుమారుడు యశ్వంత్, కూతుళ్ళు తన్వి, దివి లను పలుకరించి విజయ్ హఠాన్మరణం తనను ఎంతో భాదించిందని తెలిపారు. పన్నాల సాయిరెడ్డి,అశోక్ తదితరులు ఆయనతో ఉన్నారు.

Share this article

Related Articles