
కేంద్ర ప్రభుత్వం ఉపాధి పనులను రద్దు చేస్తుంది: వై. గీత మహేందర్
Advertisement
వికారాబాద్: కేంద్ర ప్రభుత్వం నరేంద్రమోడీ ప్రభుత్వం గ్రామీణ పేదల ఉపాధిని దెబ్బతీసే విధానాలను తీసుకువస్తోందని ప్రగతిశీల మహిళా సంఘం (POW) రాష్ట్ర కార్యదర్శి వై. గీత విమర్శించారు. గ్రామీణ శ్రామిక మహిళల ఉపాధిని దూరం చేసే వి.బి.జీ రామ్ జీ పథకాన్ని మహిళలు కలిసి వ్యతిరేకించాలని ఆమె పిలుపునిచ్చారు. అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి సదస్సు నిర్వహించారు. సదస్సుకు పీ.ఓ.డబ్ల్యూ జిల్లా కమిటీ సభ్యురాలు ప్రభావతి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వై. గీత మాట్లాడుతూ గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించే పథకాలను రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వాటి వల్ల లక్షలాది గ్రామీణ మహిళలు ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు. మహిళలపై, దళితులపై జరుగుతున్న హింసాత్మక ఘటనలను కూడా ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో పీ.ఓ.డబ్ల్యూ జిల్లా నాయకురాలు పద్మమ్మ, సరిత, లక్ష్మి, సునీత, ముని, ఎంఆర్పీఎస్ నాయకురాలు పుష్పలతతో పాటు వివిధ ప్రాంతాల నుండి మహిళలు పాల్గొన్నారు.
Share this article


