
మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు : స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
Advertisement
వికారాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ రాష్ట్రంలోని మహిళలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో సగభాగం ఉన్న మహిళలు నేడు అన్ని రంగాల్లో ఆకాశమే హద్దుగా ముందుకు సాగుతున్నారని ఆయన పేర్కొన్నారు. మహిళల అభివృద్ధితోనే కుటుంబం, రాష్ట్రం, దేశం సమగ్ర అభివృద్ధి సాధిస్తాయని తెలిపారు. రాణి రుద్రమదేవి, సావిత్రిబాయి పూలే, చాకలి ఐలమ్మ, సరోజిని నాయుడు, ఇందిరా గాంధీ వంటి మహనీయ మహిళలను స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం మహిళల అభివృద్ధి, సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
Share this article


