
General
పదో తరగతి విద్యార్థులకు రవాణా, భోజన సదుపాయం ఏర్పాటు
Saturday, 14 March 202623 views
Advertisement
మోమిన్ పేట : గ్రామపంచాయతీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి, కోలుకుంద గ్రామ సర్పంచ్ కరణం కీర్తి రామకృష్ణ పదో తరగతి విద్యార్థులకు సహాయం అందించారు. గ్రామానికి చెందిన పదవ తరగతి విద్యార్థులకు బోర్డు పరీక్షల ఫీజుతో పాటు ఎగ్జామ్స్ కిట్‌ను అందజేశారు. అదే విధంగా విద్యార్థులు సౌకర్యవంతంగా పరీక్షలు రాయడానికి గ్రామం నుండి మోమిన్పేట్ పరీక్షా కేంద్రం వరకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేశారు. పరీక్షలు ముగిసిన అనంతరం విద్యార్థులకు భోజన సదుపాయాన్ని కూడా కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి గ్రామానికి పేరు తీసుకురావాలని సర్పంచ్ కరణం కీర్తి రామకృష్ణ ఆకాంక్షించారు.
Share this article


