
General
సమగ్ర మోచి కులసంఘం వికారాబాద్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
Monday, 6 April 2026238 views
Advertisement
వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో సమగ్ర మోచి కులసంఘం నూతన కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా సంఘం నూతన కమిటీ సభ్యులను ప్రకటించారు. అధ్యక్షుడిగా అత్తాపూర్ కిషోర్, ఉపాధ్యక్షుడిగా అత్తాపూర్ ముకేశ్, ప్రధాన కార్యదర్శిగా యాలాల మల్లేష్, సంయుక్త కార్యదర్శిగా పింజరి తులసిరామ్, కార్యదర్శిగా హామీల్పూర్ సతీష్, కోశాధికారిగా హామీల్పూర్ ధనరాజ్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా టీ. రాజు, పి. నాగరాజు, హెచ్. దుర్గాప్రసాద్, ఎం. దత్తు ఎన్నికయ్యారు. సలహాదారులుగా హామీల్పూర్ రాజేందర్, సత్యనారాయణలను నియమించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సంఘం నాయకులు వికారాబాద్ నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. త్వరలో జిల్లాకు రాష్ట్ర కోర్ కమిటీ పర్యటించనున్నట్లు వెల్లడించారు.
Share this article


