
General
ఆలంపల్లి ఈద్గా వద్ద రంజాన్ ఏర్పాట్లు పరిశీలించిన మున్సిపల్ చైర్మన్
Wednesday, 11 March 20263 views
Advertisement
వికారాబాద్ : రంజాన్ పండుగ సందర్భంగా ఆలంపల్లి ఈద్గా వద్ద చేపడుతున్న ఏర్పాట్లను వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ గడ్డం అనన్య పరిశీలించారు. పండుగ రోజు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఈద్గా పరిసర ప్రాంతాల్లో పారిశుధ్యం, తాగునీటి సదుపాయం, శుభ్రత పనుల గురించి మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డితో కలిసి సమీక్షించారు. పండుగ సందర్భంగా పరిశుభ్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కౌన్సిలర్లు విశ్వనాథం రాఘవేందర్, నాయకులు మధుకర్ కాపు తదితరులతో పాటు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.
Share this article


