
వికారాబాద్ పట్టణంలో రంజాన్ తోఫా పంపిణీ
Advertisement
వికారాాబాద్: రంజాన్ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు అందిస్తున్న రంజాన్ తోఫా కిట్లు పేద కుటుంబాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని వికారాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ అర్ద సుధాకర్ రెడ్డి అన్నారు. వికారాబాద్ పట్టణంలోని 10వ వార్డు అనితగిరిపల్లిలో సోమవారం రంజాన్ పండుగను పురస్కరించుకుని ప్రభుత్వం అందిస్తున్న రంజాన్ తోఫా కిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి స్వయంగా కిట్లను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు చేరువవుతున్నాయని, రంజాన్ తోఫా ద్వారా ముస్లిం సోదరులకు ఆర్థికంగా ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, వార్డు ప్రజలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Share this article


