download
వికారాబాద్‌లో ఆటో చోరీ
General

వికారాబాద్‌లో ఆటో చోరీ

Wednesday, 18 March 202652 views

Advertisement

వికారాబాద్: వికారాబాద్ పట్టణంలో మరోసారి దొంగల బెడద కలకలం రేపింది. పట్టణంలోని BSNL రోడ్డులో ఉన్న సిండికేట్ బ్యాంక్ సమీపంలో అర్ధరాత్రి సమయంలో ఆటో చోరీ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, TS 34 T 7580 నెంబర్ గల ఆటోను యజమాని ఎప్పటిలాగే రోడ్డుపై నిలిపి ఉంచగా, చీకటిని ఆసరాగా చేసుకున్న గుర్తుతెలియని దొంగలు దానిని అపహరించుకుపోయారు. ఉదయం లేచి చూసే సరికి వాహనం కనిపించకపోవడంతో బాధితుడు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. దీంతో వెంటనే పోలీసులను ఆశ్రయించిన బాధితుడు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.

Share this article

Related Articles