
ప్రతి వార్డును శుభ్రంగా ఉంచి, సౌకర్యాలు కల్పిస్తాం: చైర్ పర్సన్
Advertisement
వికారాబాద్: వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డును పరిశుభ్రంగా ఉంచి, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించడం మా ప్రాధాన్యత అని మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం అనన్య అన్నారు. సోమవారం ఉదయం 13వ వార్డు ఆలంపల్లిలో ఆమె పర్యటించి స్థానిక సమస్యలను ప్రజల నుంచి నేరుగా తెలుసుకున్నారు. ఓపెన్ డ్రెయిన్లు, దెబ్బతిన్న రోడ్లు, శిథిలావస్థలో ఉన్న ఇళ్లను పరిశీలించారు. నీటి వృథా నివారించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, అన్ని వార్డుల్లో శుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం వార్డులో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను కూడా ఆమె పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అర్థ సుధాకర్ రెడ్డి, కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Share this article


