download
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా హోలీ వేడుకలు
General

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా హోలీ వేడుకలు

Tuesday, 3 March 20263 views

Advertisement

వికారాబాద్ : హోలీ పండుగను పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయంలో రంగుల వేడుకలు అత్యంత ఉత్సాహంగా, వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకల్లో జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్ తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది, హోం గార్డులు మరియు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలు స్నేహభావం, ఐక్యత, సోదరభావాన్ని ప్రతిబింబించాయి. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులు, సిబ్బంది, హోం గార్డులు మరియు వారి కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. “మంచి చెడుపై గెలుపును సూచించే రంగుల పండుగ అయిన హోలీ ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త వెలుగును, ఆనందాన్ని నింపాలి” అని ఆమె అన్నారు. అలాగే, జిల్లా పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ ఒకే కుటుంబ సభ్యులని, నిరంతరం విధుల్లో నిమగ్నమై ఉండే సిబ్బందికి ఇటువంటి వేడుకలు మానసిక ఉల్లాసాన్ని కలిగించి పరస్పర ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి , ఏఆర్ డీఎస్పీ వీరేష్, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, ఉమెన్ ఇన్స్పెక్టర్,ఇన్స్పెక్టర్ లు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్.ఐ లు, RSI లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Share this article

Related Articles