
ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు : పట్లోళ్ల రఘువీర్ రెడ్డి
Advertisement
వికారాబాద్, : పవిత్ర రంజాన్ పండుగ (ఈద్-ఉల్-ఫితర్) సందర్భంగా పట్లోళ్ల రఘువీర్ రెడ్డి ముస్లిం సోదరసోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం సోదరులు తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఆనందంగా రంజాన్ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఉపవాస దీక్షలు, ప్రార్థనలు ఆధ్యాత్మిక చింతనను పెంపొందించే ఈ పవిత్ర పండుగ సోదర భావాన్ని మరింత బలపరచాలని అన్నారు. రంజాన్ పండుగ లౌకికవాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ అవతరించిన ఈ రంజాన్ మాసంలో పాటించే కఠోర ఉపవాసాలు, క్రమశిక్షణతో నిర్వహించే ప్రార్థనలు, జకాత్, ఫిత్రా రూపంలో చేసే దానధర్మాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని రఘువీర్ రెడ్డి అన్నారు. ఈ పర్వదినం ప్రతి ఇంటికి శాంతి, సౌఖ్యం, సిరిసంపదలు తీసుకురావాలని ఆయన కోరుకున్నారు.
Share this article


