
ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పనులు ప్రారంభించిన వైస్ చైర్మన్
Advertisement
వికారాబాద్ : అనంతగిరిపల్లి 10వ వార్డు లో బోయ నాగరాణి–యాదయ్య దంపతులకు కేటాయించిన ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వికారాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్థ సుధాకర్ రెడ్డి హాజరై శుభారంభం చేశారు. ఈ వేడుకలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజునాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డి నందు, నాగరాజు, నంది అంజయ్య, సాయి తదితరులు, వార్డు ఆఫీసర్ సాయి మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారురాలు నాగరాణి మాట్లాడుతూ, “నాకు ఇందిరమ్మ ఇల్లు రావడం ఎంతో ఆనందంగా ఉంది” అని తెలిపారు. ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్, మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం అనన్య, అలాగే వార్డు కౌన్సిలర్ మరియు వైస్ చైర్మన్ అర్థ సుధాకర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Share this article


