download
తెలంగాణ బార్ కౌన్సిల్‌కు ఆకుల మహేష్ కుమార్ ఎన్నిక
General

తెలంగాణ బార్ కౌన్సిల్‌కు ఆకుల మహేష్ కుమార్ ఎన్నిక

Saturday, 14 March 202614 views

Advertisement

వికారాబాద్‌ : తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో అడ్వకేట్ ఆకుల మహేష్ కుమార్ ఘన విజయం సాధించారు. తెలంగాణ హైకోర్టు పరిధిలో నిర్వహించిన ఈ ఎన్నికల్లో మొత్తం 203 మంది అభ్యర్థులు పోటీ చేయగా, మహేష్ కుమార్ మూడో స్థానంలో నిలిచి విజయం సాధించారు. వికారాబాద్ పట్టణానికి చెందిన ఆయన విజయం స్థానిక ప్రజలకు గర్వకారణంగా మారింది. న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం, సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆయన మంచి గుర్తింపు పొందారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన న్యాయవాదులందరికీ మహేష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ పదవీకాలం ఐదు సంవత్సరాలు ఉంటుంది.

Share this article

Related Articles