
General
వికారాబాద్ సమీపంలో ఆర్టీసీ బస్సు – టిప్పర్ ఢీ
Tuesday, 24 March 2026381 views
Advertisement
వికారాబాద్: కోట్‌పల్లి నుండి వికారాబాద్ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సుకు ప్రమాదం జరిగింది. వికారాబాద్ సమీపంలోని లక్షీనగర్ తండా వద్ద రోడ్డు పనులు కొనసాగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… రోడ్డు పనుల కోసం అక్కడ నిలిపిన టిప్పర్ వాహనం రివర్స్ తీసే క్రమంలో, ఆర్టీసీ బస్సు వెనుక భాగాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ఇద్దరు ప్రయాణికులు స్వల్ప గాయాలకు గురయ్యారు. బస్సులో ఉన్న ఇతర ప్రయాణికులను మరో ఆర్టీసీ బస్సులో వికారాబాద్‌కు పంపించారు.
Share this article


