
General
ఎన్ఆర్ఈజీఎస్ నిధులు కేటాయించలేదు
Saturday, 28 March 202613 views
Advertisement
వికారాబాద్: గత రెండు దపాలుగా ఎన్ఆర్ఈజీఎస్ నిధులు తమ గ్రామానికి కేటాయించని కారణంగా గ్రామం అభివృద్ధిలో వెనుకబడిందని ఈ విషయాన్ని గమనించి నిధులు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ సంఘం ప్రధాన కార్యదర్శి కోల్కొంద సర్పంచ్ కరణం కీర్తి రామకృష్ణ పేర్కొన్నారు. సర్పంచుల శిక్షణ శిబిరం ముగింపు సందర్భంగా ఆమె జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ గారికి జిల్లా పంచాయతీ అధికారి డాక్టర్ పి జయసుధ దృష్టికి ఈ విషయం తీసుకువచ్చారు. గత రెండు మాసాలుగా గ్రామానికి పంచాయతీ కార్యదర్శి లేని కారణంగా ఇబ్బందుల పాలవుతున్నామని గతంలో ఉన్న గ్రామ పంచాయతీ కార్యదర్శికి గ్రూప్ 3 ఉద్యోగం రావడంతో వెళ్లారని గ్రామపంచాయతీ కార్యదర్శనీ నియమించి గ్రామాభివృద్ధికి సహకరించాలన్నారు
Share this article


