download
గుర్తుతెలియని వృద్ధురాలి మృతి
General

గుర్తుతెలియని వృద్ధురాలి మృతి

Saturday, 7 March 20262 views

Advertisement

వికారాబాద్ : వికారాబాద్ జిల్లా నవాబ్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మైతాభ్ ఖాన్ గూడ గ్రామం సమీపంలో శుక్రవారం రాత్రి గుర్తుతెలియని మహిళా వృద్ధురాలు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి వివరాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ప్రస్తుతం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరచినట్లు వెల్లడించారు. ఎవరైనా మృతురాలిని గుర్తిస్తే నవాబ్ పేట్ పోలీస్ స్టేషన్ ఫోన్ నంబర్ 8712670039 కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.

Share this article

Related Articles