download
మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలి: మున్సిపల్ చైర్ పర్సన్
General

మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలి: మున్సిపల్ చైర్ పర్సన్

Sunday, 8 March 20263 views

Advertisement

వికారాబాద్: మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య అన్నారు. ఆదివారం వికారాబాద్ పట్టణంలోని గౌలికర్ ఫంక్షన్ హాల్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వచ్చి తమ ప్రతిభను చాటుకోవాలని సూచించారు. మహిళల సాధికారతకు ప్రభుత్వం మరియు సమాజం కలిసి సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా ఎస్పీ సూచనల మేరకు వికారాబాద్ సీఐ రఘుకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో కొత్తగా ఎన్నికైన మహిళా కౌన్సిలర్లను సన్మానించారు. అనంతరం విద్యార్థినులు ఆటపాటలతో అలరించగా, వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ మహిళా సిబ్బంది , ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Share this article

Related Articles