download
నిరుపేదలకు చేయూతగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
General

నిరుపేదలకు చేయూతగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

Saturday, 6 June 202613 views

Advertisement

వికారాబాద్, జూన్ 6: నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం అందిస్తున్న ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను వికారాబాద్ మండలానికి చెందిన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. తెలంగాణ శాసనసభ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో వికారాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బిళ్లపాటి రాజశేఖర్ రెడ్డి, జిల్లా ఆర్టీఏ సభ్యుడు ఎర్రవల్లి జాఫర్, వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చాపల శ్రీనివాస్ ముదిరాజ్, వైస్ చైర్మన్ మల్లేశం తదితరులు పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సహకారంతో నిరుపేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సాయం అందుతోందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఈ నిధులు ఎంతో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు తమకు అందించిన సహాయానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్లు, సర్పంచ్‌లు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Share this article

Related Articles