download
వికారాబాద్ లో ఘనంగా హనుమాన్ జన్మోత్సవ వేడుకలు
General

వికారాబాద్ లో ఘనంగా హనుమాన్ జన్మోత్సవ వేడుకలు

Thursday, 2 April 2026181 views

Advertisement

వికారాబాద్ : హనుమాన్ జన్మోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం బండాబాయి బస్‌స్టాండ్‌ రోడ్డులోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఉదయం నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. అలాగే ఉదయం 11 గంటలకు స్వామివారి పల్లకి సేవను ఘనంగా నిర్వహించగా మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పాల్గొని పల్లకి మోసారు.. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి వారిని దర్శించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించి భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉత్సవ వాతావరణాన్ని సంతరించుకున్నాయి.

Share this article

Related Articles