download
బీజేపీ కౌన్సిలర్స్ ను సన్మానించిన వడ్లనందు
General

బీజేపీ కౌన్సిలర్స్ ను సన్మానించిన వడ్లనందు

Monday, 6 April 202626 views

Advertisement

వికారాబాద్: మున్సిపల్ కౌన్సిల్‌లో ప్రమాణ స్వీకారం చేసిన నలుగురు మున్సిపల్ కౌన్సిలర్లను వికారాబాద్ అసెంబ్లీ కోఆర్డినేటర్ వడ్ల నందు సన్మానించారు. ఈ సందర్భంగా 33వ వార్డు కౌన్సిలర్ మరియు బీజేపీ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ అనిల్ యాదవ్, 5వ వార్డు కౌన్సిలర్ స్రవంతి శ్యామ్ రెడ్డి, 24వ వార్డు కౌన్సిలర్ రుచిత సాయి చరణ్ రెడ్డి, 28వ వార్డు కౌన్సిలర్ లావణ్య సురేందర్‌లను ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా వడ్ల నందు మాట్లాడుతూ. పట్టణ ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ప్రతి వార్డులో ఉన్న సమస్యలపై వెంటనే స్పందించి, కౌన్సిల్‌లో ప్రజల తరపున పోరాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సాయి చరణ్ రెడ్డి, మల్లా రెడ్డి, నర్సిములు, రాంచందర్ తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Share this article

Related Articles