download
తల్లి లేని బిడ్డ పెళ్లి చేసి బంగారం పెట్టిన కాంగ్రెస్ నాయకుడు
General

తల్లి లేని బిడ్డ పెళ్లి చేసి బంగారం పెట్టిన కాంగ్రెస్ నాయకుడు

Friday, 6 March 20262 views

Advertisement

వికారాబాద్,,:వికారాబాద్ జిల్లా కోట్ పల్లి మండల పరిధిలోని కరీంపూర్ గ్రామానికి చెందిన తల్లి లేని బిడ్డ ఇర్ఫానబేగం పెళ్లి సుమారు 12 లక్షలతో పెళ్ళి చేయడం సంతోషంగా ఉందని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు అయుబ్ అన్సారి అన్నారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆయుబ్ అన్సారి మాట్లాడుతూ. ,గ్రామస్థులకు మాట ఇచ్చిన ప్రకారం కరీంపూర్ గ్రామంలో పెళ్లి చేసుకున్న వారికి ఆర్థిక సహాయం అందజేస్తున్నానని తెలిపారు. కరీంపూర్ గ్రామానికి చెందిన పహిల్మానోళ్ళ జహంగీర్ కూతురు వివాహానికి సుమారు 12 లక్షల వరకు వెచ్చించి చేశానని అన్నారు. తల్లి లేని బిడ్డ వివాహానికి ఆర్థిక సహాయం అందించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఇర్ఫాన బేగం వివాహానికి అలమారితోపాటు 50 జతల బట్టలు అందజేశామని అన్నారు. మెడలో వేసుకోవడానికి మూడు తులాల బంగారం, గొలుసుతోపాటు, కాళ్లకు వేసుకోవడానికి 15 తులాల వెండి పట్టీలు అందజేశామని పేర్కొన్నారు. సుమారు 30 వేల రూపాయల ఫ్రిజ్ తో పాటు డ్రెస్సింగ్ టేబుల్ వాషింగ్ మషీన్ అందజేశామని అన్నారు. వివాహానికి వచ్చిన బంధువులు, స్నేహితులు తినడానికి మంచి వంటలు చేసి వడ్డించామని అన్నారు. కరీంపూర్ గ్రామంలో ఉన్న పేద ప్రజలకు ఆర్థిక సహాయం అందజేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. భవిష్యత్తులో గ్రామంలో ఎవరి వివాహం జరిగిన గతంలో చెప్పిన విధంగా ఆదుకుంటామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కరీంపూర్ గ్రామ ప్రజలు నా కుటుంబ సభ్యులతో సమానమని, ఊపిరి ఉన్నంతవరకు వారితో సత్సంబంధాలతో ఉంటానని అన్నారు. ఇర్ఫానా బేగం వివాహానికి కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆయుబ్ అన్సారి హాజరై ఆశీర్వదించారు,

Share this article

Related Articles