
General
బీజేపీ నాయకుల అరెస్ట్
Monday, 23 March 202627 views
Advertisement
వికారాబాద్, మార్చి 23: అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో వికారాబాద్ జిల్లా బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. జిల్లాలో పలుచోట్ల బీజేపీ ముఖ్య నాయకులను గృహ నిర్బంధంలో ఉంచగా, మరికొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అరెస్టులపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రజాస్వామ్య హక్కులను హరించే చర్యలని విమర్శించారు. కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించాలన్న తమ ఉద్దేశ్యాన్ని పోలీసులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
Share this article


