
మహిళల గొప్పతనాన్ని గుర్తించే ప్రత్యేక సందర్భం మహిళా దినోత్సవం
Advertisement
వికారాబాద్: మహిళా దినోత్సవం కేవలం ఒక రోజు మాత్రమే కాకుండా సమాజంలో మహిళల శ్రమ, త్యాగం మరియు గొప్పతనాన్ని గుర్తించే ప్రత్యేక సందర్భమని విద్యాసంస్థల కార్యదర్శి ఏ. ప్రమీల, డా. చండ్రప్రియ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ACR’S భృంగీ విద్యాసంస్థలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల కార్యదర్శి ఏ. ప్రమీల, డా. చండ్రప్రియ పాల్గొని మహిళా దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు” అనే మాటలతో సృష్టిలో మహిళల ప్రాధాన్యత ఎంతో గొప్పదని అన్నారు. తల్లిగా, సోదరిగా, భార్యగా, కుమార్తెగా కుటుంబానికి వెన్నుముకగా నిలుస్తూనే మహిళలు విద్య, వైద్యం, వ్యాపారం, అంతరిక్షం, రాజకీయాలు వంటి అన్ని రంగాల్లో తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థ డైరెక్టర్ కుమారస్వామి శివప్రసాద్, అధ్యాపకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Share this article


