download
వికారాబాద్‌లో కాంగ్రెస్ సమావేశాలు హాజరైన రాహుల్ గాంధీ, సీఎం
General

వికారాబాద్‌లో కాంగ్రెస్ సమావేశాలు హాజరైన రాహుల్ గాంధీ, సీఎం

Monday, 2 March 20266 views

Advertisement

వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ కీలక రాజకీయ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. రాహుల్ గాంధీ వికారాబాద్ పర్యటన నేపథ్యంలో జిల్లా కేంద్రంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. వికారాబాద్ ఎస్ఏపి కళాశాల నుండి అనంతగిరిగుట్ట హరితా రిసార్ట్స్ వరకు భద్రత కట్టుదిట్టం చేశారు. ముందుగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హైదరాబాద్ చేరుకోగా, శంషాబాద్ విమానాశ్రయంలో సీఎం రేవంత్ రెడ్డి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా వికారాబాద్‌కు చేరుకున్న ఆయనకు ఎస్ఏపి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ హెలిప్యాడ్ వద్ద ఘన స్వాగతం లభించింది. తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి , వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర మంత్రులు , మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం అనన్య తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ఎస్ఏపి కళాశాల ప్రాంగణంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ అధ్యక్షతన కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (PAC) సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరిగాయి. పీఏసీ సమావేశం అనంతరం అనంతగిరి హరితా హోటల్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాహుల్ గాంధీ పాల్గొని డీసీసీ అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయి నుంచి సమన్వయం పెంపు, ప్రజా సమస్యలపై కట్టుబాటు అవసరమని సూచించారు. శిక్షణా శిబిరానికి మంత్రులు హాజరుకావద్దని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ముందుగానే స్పష్టం చేయడంతో, సమావేశం అనంతరం మంత్రులు హైదరాబాద్‌కు బయల్దేరారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డీసీసీ అధ్యక్షుల కుటుంబ సభ్యులతో రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ఫోటోలు దిగారు. అనంతగిరి హిల్స్ ప్రాంతం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల రాకపోకలతో కిక్కిరిసిపోయింది. మొత్తంగా వికారాబాద్ పర్యటన కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహాన్ని నింపిందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడ్డాయి.

Share this article

Related Articles