download
ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు : మునిసిపల్ వైస్ చైర్మన్
General

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు : మునిసిపల్ వైస్ చైర్మన్

Friday, 20 March 202624 views

Advertisement

వికారాబాద్: పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా వికారాబాద్ మునిసిపల్ వైస్ చైర్మన్ అర్థ సుధాకర్ రెడ్డి పట్టణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రంజాన్ పండుగ శాంతి, సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. ఉపవాస దీక్షలు మనలో ఆత్మ నియంత్రణ, సహనాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. సమాజంలో సోదరభావం, పరస్పర గౌరవం మరింత బలపడాలని ఆకాంక్షించారు. అలాగే, ప్రతి ఒక్కరూ పండుగను సంతోషంగా, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు

Share this article

Related Articles