
గోశాల ఏర్పాటుతో ఆధ్యాత్మిక వాతావరణం బలపడుతుంది: శ్రీకాంత్ రెడ్డి
Advertisement
వికారాబాద్ (మర్పల్లి) : గ్రామంలో గోశాల ఏర్పాటుతో ఆధ్యాత్మిక వాతావరణం మరింత బలపడుతుందని, దేవాలయం చుట్టూ భక్తి భావం పెంపొందుతుందని బీఆర్‌ఎస్ పార్టీ మర్పల్లి మండల అధ్యక్షులు, రావులపల్లి సర్పంచ్ నాద్రిగా శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. మర్పల్లి మండలం రావులపల్లి గ్రామంలోని శ్రీ పితాంబరేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో నిర్మించిన గోశాలను సర్పంచ్ నాద్రిగా శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, గోశాలలు కేవలం గోవుల సంరక్షణ కేంద్రాలు మాత్రమే కాకుండా, మన సంస్కృతి, సంప్రదాయాల ప్రతీకలు. గోమాతను పూజించడం ద్వారా ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. గ్రామంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొంటాయి అని పేర్కొన్నారు. దేవాలయం కేంద్రంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల గ్రామ సమాజం ఒకటిగా నిలుస్తుందని, ఆధ్యాత్మికతతో పాటు సామాజిక ఐక్యత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. గోశాల నిర్మాణానికి దాతగా వ్యవహరించిన నాద్రిగ అనంత రెడ్డిని ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ వడ్ల బ్రాహ్మము, ఉప సర్పంచ్ పాండయ్య, మాజీ ఆలయ కమిటీ చైర్మన్ కిషోర్ గౌడ్, మాజీ PACS డైరెక్టర్ నరేందర్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు గొల్ల నర్సిములు, గ్రామ పంచాయతీ వార్డ్ మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Share this article


