
నవాబ్‌పేట వీధుల్లో హోలీ సందడి...
Advertisement
నవాబుపేట్ : నవాబుపేట్ గ్రామంలో హోలీ పండుగ వేడుకలు అత్యంత వైభవంగా, ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. రంగుల పండుగను పురస్కరించుకుని గ్రామంలోని యువత మరియు చిన్నారులు అందరూ ఒకచోట చేరి రంగుల కేళిలో మునిగితేలారు. ఉదయం నుండే యువకులు గుంపులు గుంపులుగా వీధుల్లోకి చేరి, ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ, పాటల సందడి మధ్య కేరింతలు కొడుతూ హోలీని ఘనంగా జరుపుకున్నారు. మరోవైపు చిన్నారులు తమ పిచికారీలతో రంగు నీళ్లు చల్లుకుంటూ పండుగను ఎంతో సరదాగా ఆస్వాదించారు. ఎటువంటి భేదభావాలు లేకుండా గ్రామంలోని వారంతా కలిసిమెలిసి పండుగ జరుపుకోవడంతో నవాబ్‌పేట వీధులన్నీ రంగులమయంగా మారి స్నేహపూర్వక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ, ఇలాంటి పండుగలు గ్రామంలో ఐకమత్యాన్ని, సోదరభావాన్ని పెంపొందిస్తాయని ఆనందం వ్యక్తం చేశారు.
Share this article


