ఓటర్ నమోదు ప్రక్రియ పారదర్శకంగా ఉండేలా బూతు స్థాయి అధికారులు పనిచేయాలి: జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి

0
15 Views

వికారాబాద్: ఓటర్ నమోదు ప్రక్రియ పారదర్శకంగా ఉండేలా బూతు స్థాయి అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. జనవరి 20, 21 తేదీలలో నిర్వహించే ప్రత్యేక ఓటురు నమోదు కార్యక్రమంలో భాగంగా శనివారం సంగం లక్ష్మీబాయి ఉన్నత పాఠశాలల ఆవరణలో ఏర్పాటుచేసిన ప్రత్యేక శిబిరాన్ని కలెక్టర్ సందర్శించారు. ఓటరు నమోదు, ఓటర్ ఐడి కార్డులో చేర్పులు, మార్పులపై వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని బిఎల్ఓ లకు సూచించారు. ఓటరుగా రెండుసార్లు నమోదు అయినట్లయితే వాటిని పరిశీలించాలని అదేవిధంగా 20 సంవత్సరాలు దాటిన వ్యక్తులు ఓటరుగా నమోదు చేసుకుంటున్నట్లు అయితే వాటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ధ్రువీకరించాలని  తెలిపారు. ఓటరు జాబితాలో తొలగింపులు, దిద్దుబాట్లకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలించాలని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆన్లైన్ లో ద్వారా వస్తున్న దరఖాస్తులపై కలెక్టర్ బిఎల్ఓ లను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు వికారాబాద్ తహసిల్దార్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.