ప్రజల్లో సామాజిక, రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చిన కాళోజీ కృషి మరువలేనిది: జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

0
106 Views

వికారాబాద్: ప్రజల్లో సామాజిక, రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చిన కాళోజీ కృషి మరువలేనిదని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు.సోమవారం తెలంగాణ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని కాళోజీ నారాయణ రావు జయంతి వేడుకలను కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వించడం జరిగింది. ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి కాళోజీ నారాయణరావు చిత్ర పటానికి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లు లింగ్యా నాయక్, సుధీర్, ఆర్డిఓ వాసు చంద్రలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… సామాజిక సమస్యలపై నిర్మోహమాటంగా, నిక్కచ్చిగా స్పందించే వ్యక్తిత్వం కాళోజీది అన్నారు. సత్యాగ్రహ మహోద్యమంలో పాల్గొని పిన్న వయసులోనే జైలు జీవితం గడిపారని కలెక్టర్ తెలిపారు. విద్యార్థి దశ నుండే నిజాం ప్రభుత్వం నిషేదాజ్ఞలకు వ్యతిరేఖంగా పోరాటం సల్పిన గొప్ప నాయకులు కాళోజి అన్నారు.జయంతి వేడుకలో సామాజిక కార్యకర్తలు బందప్ప నర్సప్ప గౌడ్, సంగీతపు రాజలింగం లు కాళోజీ జీవన శైలి, కవిత్వంలో ఆయన వాడిన పదజాలంపై కవితా సంపుటితో వివరించారు. ఈ సందర్భంగా వీరిని జిల్లా కలెక్టర్ శాలువాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ హనుమంతరావు, బీసీ, ఎస్సీ అభివృద్ధి అధికారులు ఉపేందర్, మల్లేశం లతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.