ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి అధికారులు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు.

0
104 Views

వికారాబాద్:ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు.సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, ఆర్డిఓ వాసు చంద్ర లతో కలిసి ప్రజల నుండి 199 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి సమస్య పరిష్కార దిశగా అధికారులు పనిచేయాలన్నారు. భూమి సమస్యలు అధికంగా వస్తున్న క్రమంలో మండల స్థాయిలో పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని తెలిపారు.రుణమాఫీపై వస్తున్న ఫిర్యాదుల పట్ల వ్యవసాయ అధికారులు పరిశీలించి రుణమాఫీ మాఫీ కాక పోవడానికి గల కారణాలను తెలుసుకొని సమస్య పరిష్కార దిశగా పని చేయాలని కలెక్టర్ సూచించారు. అధిక వర్షాల వల్ల దెబ్బతిన్న పంటల వివరాలను రైతుల పొలాల వద్దకు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికలు సమర్పించాలని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ భవనాలు, ఇండ్లు దెబ్బతిన్నట్లయితే వివరాలు ఇవ్వాలన్నారు.ప్రజావాణిలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.