వయోవృద్ధుల సేవలను గౌరవిస్తూ అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా పురస్కారాలు

0
106 Views

వికారాబాద్: వికారాబాద్ జిల్లా మహిళ, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ 1న జరగబోయే అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా, వయోవృద్ధుల కోసం విశిష్ట సేవలందిస్తున్న వ్యక్తులు మరియు సంస్థలకు పురస్కారాలు అందజేయనున్నట్లు జిల్లా మహిళా,శిశు,దివ్యాంగులు,వయోవృద్దుల సంక్షేమ అధికారిణి  B. కృష్ణవేణి తెలిపారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ విశిష్ట సేవలందించిన వయోవృద్ధులు మరియు సంస్థలు ఈ పురస్కారాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించింది. అర్హులైన వారు సెప్టెంబర్ 25 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులు అందజేయవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తు ప్రక్రియ హైదరాబాదు మలక్‌పేట్‌లోని నల్గొండ క్రాస్ రోడ్ బస్ స్టాప్ పక్కన ఉన్న దివ్యాంగుల సంక్షేమ భవనంలో పూర్తిచేయవచ్చని తెలియజేశారు.పురస్కారాల కేటగిరీలు, అర్హత మరియు ఇతర వివరాల కోసం www.wdsc.telangana.gov.in వెబ్‌సైట్‌ ద్వారా సమాచారం పొందవచ్చని వికారాబాద్ జిల్లా సంక్షేమ అధికారిణి  B. కృష్ణవేణి తెలిపారు.