నిరుద్యోగ మైనారిటీ యువత కోసం నైపుణ్య అభివృద్ధి కోర్సుల్లో శిక్షణ:జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి హనుమంతరావు

0
153 Views

వికారాబాద్: తెలంగాణ ప్రభుత్వ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా చదువుకున్న నిరుద్యోగ మైనారిటీ యువత కోసం నైపుణ్య అభివృద్ధి కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఐటి, విద్య ఆరోగ్యం, అకౌంటింగ్ (CA, Tally, IT, & GST) , హౌసింగ్ , పశువుల పెంపకం , డైరీ మరియు వెటర్నరీ మొదలైన కోర్సుల్లో శిక్షణ ఇవ్వనిన్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా ఫ్యాషన్ డిజైనింగ్ (టైలరింగ్), అడ్వాన్స్ బ్యూటిఫికేషన్, హార్టికల్చర్, టూరిజం మరియు హాస్పిటాలిటీ, ఎయిర్ హోస్టెస్ క్యాబిన్ క్రూ, మొదలైనవి. లైట్, హెవీ మోటార్ డ్రైవింగ్ , ఎలక్ట్రీషియన్, ఫైర్ & సేఫ్టీ, స్వయం ఉపాధి, స్మార్ట్‌ఫోన్ , హ్యాండ్‌సెట్ రిపేరింగ్, (సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్) అడ్వాన్స్‌డ్ మెకనైజ్డ్ ఫర్నీచర్, మ్యానుఫ్యాక్చరింగ్, (ప్యాకేజింగ్ ఇండస్ట్రీ) మొదలైన వాటిలో శిక్షణ ఇచ్చేందుకు నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NSDC), టాస్క్, MEPMA, GOI బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ (V.E), మరియు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లేదా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్‌ సంస్థలకు ఆయన సూచించారు. శిక్షణా సంస్థలు పైన పేర్కొన్న పత్రాలు, ప్రాజెక్ట్ రిపోర్టుతో పాటు హార్డ్ కాపీలు వైస్ ఛాన్స్లర్ మేనేజింగ్ డైరెక్టర్, మైనార్టీ. ఫైనాన్స్ కార్పొరేషన్ లో అక్టోబర్ 4 లోపు హైదరాబాద్ ఆఫీస్ 5వ అంతస్తులోని హజ్ హౌస్ నాంపల్లిలో దరఖాస్తులను సమర్పించాల్సిందిగా ఆయన తెలిపారు.