రెడ్ క్రాస్ సోసైటీ అండ స్పూర్తిదాయకం: జిల్లా కలెక్టర్ నిఖిల

0
13 Views

వికారాబాద్: భారీ వర్షాల కారణంగా ఇల్లు దెబ్బతిన్న వారికి తక్షణ సాయం అందించడం, బాధితులకు అండగా ఉండటం రెడ్ క్రాస్ సొసైటీ స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇల్లు దెబ్బతిన్న నిస్సహాయులకు టార్ఫలిన్ , వంట పాత్రలు, ఆరోగ్య సామాగ్రి కిట్లను కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న అభాగ్యులకు అండగా నిలిచి, విపత్తు సమయాల్లో విశిష్ట సేవలందిస్తున్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సేవలు ప్రశంసనీయమని కలెక్టర్ అన్నారు. విపత్తు సమయాల్లో ప్రతి ఒక్కరు బాధితులకు అండగా ఉండాలని, ప్రతి ఒక్కరూ సామాజిక సేవలో ముందుకు రావాలని ఆమె కోరారు. కిట్ల పంపిణీలో జిల్లా రెవెన్యూ అధికారి అశోక్ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ అధికారి పాల్వాన్ కుమార్, అడిషనల్ ఎస్పీ రషీద్, డిపిఓ మల్లారెడ్డి, రెడ్ క్రాస్ జిల్లా గౌరవ కార్యదర్శి సాయి చౌదరి, జిల్లా కోశాధికారి డాక్టర్ సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు