ఓటర్ల ముసాయిదా జాబితా తయారికై  రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ సహకారం అందించాలి:జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్

0
306 Views
వికారాబాద్; ఓటర్ల ముసాయిదా జాబితా తయారికై  రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ సహకారం అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ కోరారు.  బుధవారం అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సుధీర్ తో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో అదనపు కలెక్టర్ ( రెవెన్యూ ) ఓటర్ల ముసాయిదా జాబితా పై  సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ…   గ్రామ పంచాయతీ ఓటర్ల ముసాయిదా జాబితా పై  అభ్యంతరాలు ఉంటే తెలపాలాన్నారు. గ్రామ పంచాయతీ ఓటర్ల ముసాయిదా జాబితాను ఈ నెల 13వ తేదీన ప్రచురించడం జరిగిందని, ఓటర్ ముసాయిదా జాబితా పై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 21వ తేదీ వరకు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు.  ముసాయిదా ఓటర్ జాబితా పై ఏమైనా అభ్యంతరాలు, అదే విధంగా ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటే  జిల్లా స్థాయిలో  రాజకీయ పార్టీల ప్రతినిధులు తగు సూచనలు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ నెల 19వ తేదీన (గురువారం) జరిగే మండల స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో తమ అభ్యంతరాలు, సూచనలు  అందజేయవచ్చని ఆయన తెలిపారు. ఈ నెల 26న అభ్యంతరాలు, సూచనలను పరిగణలోనికి తీసుకొని, 28న చివరి  ఓటర్  జాబితాను ప్రచురించడం జరుగుతుందని ఆయన తెలిపారు.  గ్రామాలలో నివసించని వారి పేర్లు, వివాహం చేసుకొని వెళ్ళిన వారి పేర్లు, చనిపోయిన వారి పేర్లను తొలగించాలని పార్టీల ప్రతినిధులు కోరడం జరిగినది. అందుకు అదనపు కలెక్టర్  జిల్లాలోని గ్రామ పంచాయతీలలో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామని, మీరు సూచించిన అంశాలను పరిగణలోకి తీసుకొని చివరి ఓటర్ జాబితా తయారు చేయడం జరుగుతుందని తెలిపారు.
  ఈ సమావేశంలో   ఇన్చార్జి డీపీఓ సంధ్యారాణి, వివిధ రాజకీయ ప్రతినిధులు మహిపాల్, ప్రసాద్, రాజేందర్ రెడ్డి, మల్లేశం, రాజేందర్ లు పాల్గొన్నారు.