రేవంత్ రెడ్డి నువ్వు హీరోలా డ్రామా చేస్తున్నావ్, కానీ నీ అయ్య జాగీరా కూల్చడానికి: మేడ్చల్ ఎంపీ ఈటేల రాజేందర్

0
148 Views

హైదరాబాద్ : రేవంత్ రెడ్డి నువ్వు హీరోలా డ్రామా చేస్తున్నావ్, కానీ నీ అయ్య జాగీరా కూల్చడానికి అని మేడ్చల్ ఎంపీ ఈటేల రాజేందర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల కూల్చివేతలపై జరుగుతున్న వివాదంపై బీజేపీ నేత, ఎం.పి ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు.ఈటెల మాట్లాడుతూ: సామాన్యులను, మధ్యతరగతి ప్రజలను భయపెడుతున్నారని, 40 ఏళ్ల క్రితమే FTLలో ప్రభుత్వ అనుమతులతో పేదలు ఇళ్లు కట్టుకున్నారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి కూల్చివేతలకు ఎవరు అనుమతి ఇచ్చారు? పెద్దోళ్ల కట్టడాలు కుల్చుకో, కానీ పేదోళ్ల కట్టడాల దగ్గరికి రాకూడదు” అని హెచ్చరించారు.