తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించాలి: జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్

0
96 Views

వికారాబాద్:తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అన్నారు.శుక్రవారం ఛాంబర్ నుండి టెలికాన్ఫరెన్స్ ద్వారా అన్ని శాఖల అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 17న తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం కలెక్టరేట్ ఆవరణలో ఘనంగా నిర్వహించేదుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఆయా శాఖల వారీగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వేడుకలు నిర్వహనకనుగునంగా వేదిక, సిట్టింగ్ ఏర్పాట్లను పక్కాగా చేసుకోవాలని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ చికిత్స అందించేలా వైద్య బృందాన్ని వేడుక స్థలి వద్ద అందుబాటులో ఉంచాలన్నారు. త్రాగునీటి ఏర్పాట్లు చేయాలన్నారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా వేడుకలు సజావుగా జరిగేలా ఆయా శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రొటోకాల్ ను అనుసరిస్తూ అతిథులకు ఆహ్వానాలు పంపాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తూ, వేడుకలు విజయవంతం అయ్యేలా చూడాలన్నారు. జాతీయ భావన పెంపొందేలా విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని డి ఇ ఓ కు సూచించారు.ఈ టెలికాన్ఫరెన్స్ లో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
.